భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir), రాజస్థాన్ (Rajastan), గుజరాత్ (Gujarath), పంజాబ్ (Panjab) రాష్ట్రాల్లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. అంతేగాక పాక్ డ్రోన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేయడమేగాక బ్లాక్ అవుట్ (Block out)ను కూడా ప్రకటించారు. జమ్ము కశ్మీర్, సాంబా సెక్టార్, ఫిరోజ్ పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు యత్నిస్తోంది. ఈ దాడిలో పాకిస్థాన్ డ్రోన్ ఫిరోజ్‌పూర్ (Firozpur) లోని ఓ ఇంటిపై పడింది. దీంతో ఆ ఇంటిలోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
#BREAKING: फिरोजपुर के खाई फेमे गांव में सिविल एरिया में गिरा ड्रोन, घर में लगी आग, 3 लोग जख्मी#Punjab pic.twitter.com/qCSRPiAgoY
— NDTV India (@ndtvindia) May 9, 2025







