బాలయ్య ‘అన్​స్టాపబుల్’-4లో ఒలింపిక్ మెడలిస్ట్

ManaEnadu : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్టుగా ‘అన్​స్టాపబుల్ సీజన్​ 4’ అన్ స్టాపబుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ షో తొలి ఎపిసోడ్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. తాజాగా రెండో ఎపిసోడ్ లో ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ మూవీ టీమ్ సందడి చేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ ఎపిసోడ్ లో హాజరయ్యారు.

అన్ స్టాపబుల్ లో ఒలింపిక్ ఛాంపియన్

ఇక ఈ ఎపిసోడ్ లో మరో గెస్టు వచ్చి ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపారు. ‘సినిమాలో అదృష్టం మనిషి జీవితాన్ని మారుస్తుంది. కానీ, నిజ జీవితంలో ఎలాంటి లక్ లేకుండా ఓ అమ్మాయి కృషి, పట్టుదలతో తన కలను గెలిచిన కథ’ అంటూ బాలయ్య ఆ ఛాంపియన్ కు ఇంట్రడక్షన్​ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఆమే.. ఇటీవల పారిస్ పారాలింపిక్స్​లో బ్రాంజ్ మెడల్ సాధించిన పారా అథ్లెట్ దీప్తి జివాంజి (Paralympic Deepthi Jivanji).

దీప్తికి బాలయ్య సాయం

దీప్తితోపాటు ఆమె కోచ్​ కూడా అన్​స్టాపబుల్ షో(Unstoppable 4)లో సందడి చేశారు. దీప్తి సాధించిన బ్రాంజ్ మెడల్​ను బాలయ్య ఆమె మెడలో వేసి కాసేపు సరదాగా ముచ్చటించారు. నెక్స్ట్ టైమ్ గోల్డ్ మెడల్ సాధించాలని విష్ చేశారు. అంతే కాకుండా దీప్తికి అన్​స్టాపబుల్ స్పాన్సర్ల తరపున రూ. 1,50,000 చెక్ అందించారు. మరోవైపు దీప్తి పట్టుదలను చూసి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) కూడా వెంటనే ఆమెకు ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్ తరఫున రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

దీప్తి జివాంజి ది బ్రాంజ్ మెడల్ విన్నర్

ఇక  సెప్టెంబర్​లో పారిస్ వేదికగా పారాలింపిక్స్ (Paris Paralympics)​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ లో దీప్తి భారత్ కు కాంస్య పతకం తీసుకొచ్చింది. 400 మీటర్ల టీ- 20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్​ దక్కించుకుంది. 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *