పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon sessions of Parliament) నేటి (జులై 21) నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలు 23 రోజుల పాటు కొనసాగనుండగా, ఆగస్టు 13, 14 తేదీల్లో ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా హాలిడే ఉండనుంది. కాగా ఇవి పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack), ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడం విశేషం. కేంద్రం ఈ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లు(Bills)లను ప్రవేశపెట్టనుంది. అటు ఆపరేషన్ సిందూర్, బిహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై నిలదేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
ఈ బిల్లులపై ప్రధానంగా చర్చ!
కాగా కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో వీటిలో మణిపూర్ GST (సవరణ) బిల్ 2025, జన్ విశ్వాస్ (సవరణ) బిల్ 2025, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్ 2025, జియోహెరిటేజ్ సైట్స్ అండ్ జియో-రెలిక్స్ (పరిరక్షణ) బిల్ 2025, జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్ 2025 వంటివి ఉన్నాయి. అలాగే, గోవా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య సరిదిద్దడం, ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్ 2025 వంటి బిల్లులు కూడా చర్చకు రానున్నాయి.

రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు షురూ
ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్, జాతీయ భద్రత(National Security), ఆర్థిక విషయాలపై తీవ్రమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. విపక్షాలు ఈ అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మాపై అభిశంసన తీర్మానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తొలుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఇరుసభలనుద్దేసించి ప్రసంగించనున్నారు. కాగా లోక్‌సభ(Lok Sabha), రాజ్యసభ(Rajya Sabha) రెండూ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు డిజిటల్ సంసద్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
Monsoon Parliament Session from July 21 to Aug 21.
7 pending & 8 new bills listed.
Delhi Court to take cognizance of ED’s chargesheet in National Herald Case on 29 July, SoGa & RaGa likely to be officially accepted as ACCUSED, right in middle of session. Huge embarrassment… pic.twitter.com/P5ijrebb2s
— BhikuMhatre (@MumbaichaDon) July 15, 2025






