పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపు 23 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(Union Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత(National Security), ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack), అనంతరం భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operaton Sindoor)’ వ్యవహారాలపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చించాలని విపక్షాలు(Opposition Parties) కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌లపైనే ప్రధాన చర్చ
పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని ఢిల్లీ(Delhi)లో జరిగిన కూటమి సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, దీపేందర్ హుడా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రియెన్, రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం(Special session of ParliamentSpecial session of Parliament) ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ MPలు ఈమేరకు పీఎం నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. కాగా వీటిపై ఈ సమావేశాల్లో ఈ అంశంపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చే ఛాన్సుంది.
#BreakingNews: Parliamentary Affairs Minister @KirenRijiju said that the government has decided to commence the Monsoon Session of Parliament from July 21 to August 12, 2025.#Parliament #MonsoonSession pic.twitter.com/isKYKED9mg
— DD News (@DDNewslive) June 4, 2025







