Janasena: మేం నిలబడ్డాం.. 4 దశాబ్దాల TDPని నిలబెట్టాం: పవన్

ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ(Janasena Formation Day) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఆయన సోదరుడు, MLC నాగబాబు(Nagababu), జనసేన సీనియర్ నేత, మంత్రి నాదేండ్ల మనోహర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్సేలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..“2018లో పోరాట యాత్ర చేశాం, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం, ఓడిపోయినా అడుగు ముందుకు వేశాం, మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం, మనన నిలబడ్డాం.. 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం” అని అన్నారు.

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా

అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదని అన్నారు. అలాగే పార్టీ ఆవిర్భం గురించి మాట్లాడుతూ.. “జనసేన జన్మస్థలం తెలంగాణ(Telangana).. కర్మస్థలం ఆంధ్రా(Andhra pradesh), తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది” అని అన్నారు.

నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు: నాగబాబు

అనంతరం MLC నాగబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇక జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు నాగబాబు. అధికారంలో ఉన్నాం కదాని అహంకారంతో మాట్లాడకూడదన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో చూశామన్నారు. నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైఎస్ జగన్ లాంటి హాస్యనటుడు మరో 20 ఏళ్ల వరకూ కలలు కంటూనే ఉండాలని సలహా ఇస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూడబోతోంది’ అని చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *