
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ 2:56 నిమిషాల పాటు కొనసాగుతూ.. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రేకేతించాయి . ట్రైలర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మేనియా కనిపించింది. ఒక్కో సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ అంతే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క డైలాగ్స్ వింటుంటే మతిపోతుంది. “ఇప్పటిదాగా మేకల్ని తినే పులులని చూసుంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు” అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ఏదేమైనా ఈ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించారనే చెప్పుకోవాలి. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ కావడం విశేషం.
ఇప్పటికే విడుదలకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు పోస్టర్స్ విడుదల చేసి సినిమా రేంజ్ ఎలా ఉండనుండో చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండటమే గాక ప్రేక్షకులకు కిక్కివ్వనుందని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర సినిమాకు మరో హైలైట్ కానుందని అంటున్నారు. నిధి గెటప్, మేకోవర్ అన్నీ కూడా ఎంతో ఆకట్టుకోనున్నాయట.
మొదట ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను క్రిష్ జాగర్లమూడి స్వీకరించారు. కానీ ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు ఏఎం జ్యోతికృష్ణ స్వీకరించి సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం మరో హైలైట్ పాయింట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి.