పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్. తమ అభిమాన హీరో సినిమాల అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించినట్టే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమా గురించి ఓ అప్డేట్ ఇప్పుడు నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా మాత్రం రిలీజ్ డేట్ ఇదే అంటూ.. ఇది ఫైనల్ అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్!
సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ (OG Release Date)పై క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబరు 5వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్.. డైరెక్టర్, నిర్మాతకు సూచనలు చేశారట. వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేసి సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావాలని చెప్పారట. ఈ నేపథ్యంలో మేకర్స్ చాలా బిజీబిజీగా పనుల్లో నిమగ్నమయ్యారట.
మే నెలలో పవన్ మేనియా
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ఓజీ పనులు జెట్ స్పీడులో జరుగుతున్న నేపథ్యంలో మే నుంచి వరుస అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారట. ఇక మే నెలలో పవన్ కళ్యాణ్ అభిమానులకే పండుగ. ఎందుకంటే ఓ వైపు ఓజీ సినిమా అప్డేట్స్.. మరోవైపు హరిహరవీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ నెలలో మొత్తం పవన్ మేనియానే కనబడనుంది. ఇక ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తుండగా.. శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ పాత్రలో సందడి చేయనున్నారు.






