పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫుల్ స్పీడులో ఉన్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న తన మూవీలను జెట్ స్పీడుతో కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్.. తాజాగా తన రోల్‌కు సంబంధించి డబ్బింగ్(Dubbing)ను కూడా అంతే వేగంగా కంప్లీట్ చేసినట్లు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం (AM Ratnam) తెలిపారు. షూటింగ్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ దానిని పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్‌గా నాలుగు గంటల్లో దాన్ని పూర్తి చేశారని ఆయన చెప్పారు.
🚨🚨 Power Storm Alert! 🔥🔥🔥
Power Star @PawanKalyan garu wraps #HariHaraVeeraMallu dubbing and crushed it in just 4 hours! with unmatched fire! 🔥
Brace for an adrenaline blitz on June 12th! ⚔️🔥#PawanKalyan pic.twitter.com/uPON2scueq
— Bharat Media (@bharatmediahub) May 29, 2025
ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో..
కాగా జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ‘హరి హర వీరమల్లు’ విడుదల(Release) కాబోతోంది. ఇటీవలే ఈ సినిమాలోని ‘తార తార…’ అనే పాటను చెన్నై(Chennai)లో విడుదల చేశారు. ఈ ప్రమోషన్స్(Promotions)ను పీక్స్‌కు తీసుకెళుతున్న మేకర్స్.. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్(Updates)ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా(SM)లో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా థియేటర్ల బంద్(Movie theaters closed) నిర్ణయం అటకెక్కేయడంతో రాబోయే మూడు వారాలలో తమ చిత్రాలను విడుదల చేయబోతున్న నిర్మాతలంతా(Producers) ఊపిరి పీల్చుకున్నారు.







