సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శుభం. ఈ సినిమా మే 9న విడుదలై ప్రేక్షకులను అలరించింది. సెటైరికల్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను మిళితం చేసిన ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా, విడుదలైన ఐదు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. సమంత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించటమే కాకుండా అతిథి పాత్రలో కూడా కనిపించింది.
విశేషమైన తారాగణం
ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వలు కీలక పాత్రల్లో నటించారు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బడ్జెట్ ఎంతంటే..?
టెలివిజన్ సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులపై చూపే ప్రభావం చుట్టూ కథ నడిపిన ఈ సినిమాను సుమారు ₹2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రమోషన్, ఇతర ఖర్చులతో కలిపి (సమంత రెమ్యునరేషన్ మినహాయించి) మొత్తం బడ్జెట్ ₹3.5 కోట్ల వరకు వెళ్లింది. థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ₹4 కోట్ల షేర్, ₹8 కోట్ల గ్రాస్ వాల్యూగా నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలైంది.
పాజిటివ్ బజ్‌తో కలెక్షన్లు పుంజుకున్న శుభం
పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాపై మంచి టాక్ రావడంతో కలెక్షన్లు రోజు రోజుకూ పెరుగుతూ వచ్చాయి. భారీ వసూళ్లు లేనప్పటికీ, సినిమాకు థియేట్రికల్‌గా మంచి ఫలితం దక్కింది. ఫస్ట్ టైం నిర్మాతగా అడుగుపెట్టిన సమంతకు ఇది మంచి లాభాలను తీసుకొచ్చింది.
ఇండియాలో కలెక్షన్లు ఎలా ఉన్నాయి?
ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా మొదటిరోజు 60 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత 2వ రోజు 75 లక్షలు, 3వ రోజు – 90 లక్షలు 4వ రోజు – 50 లక్షలు, 5వ రోజు – 50 లక్షలు, 6వ రోజు – 50 లక్షలు, 7వ రోజు – 40 లక్షలు రాబట్టింది, ఈ లెక్కన మొదటి వారంలో మొత్తం 4.15 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
రెండో, మూడో వారాల్లో పరిస్థితి
19 రోజుల థియేట్రికల్ రన్‌లో రోజుకు సగటున 20 లక్షల చొప్పున కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఇండియాలో 6.35 కోట్ల థియేట్రికల్ గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో లాభాలు భారీగానే!
తెలుగు రాష్టాల్లో ఈ సినిమా భారీగానే లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి. నైజాం: 1.25 కోట్లు, ఏపీ: 1.5 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల షేర్, 5.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో ‘శుభం’కి మంచి ఆదరణ
ఇండియాలో శుభం సినిమా మంచి లాభాలు పొందినట్టే అమెరికాలో కూడా మంచి లాభాలను పొందింది. నార్త్ అమెరికా, కెనడాలో కలిపి ఈ సినిమా ₹1.75 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
అంతర్జాతీయంగా ఈ సినిమా:
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా నెట్ కలెక్షన్లు: 8 కోట్లు, గ్రాస్ కలెక్షన్లు: 12 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 8 కోట్ల గ్రాస్ వసూళ్లను తొలివారంలోనే దాటి, థియేట్రికల్‌గా 3 కోట్ల లాభం తెచ్చుకుంది.
ఓటీటీ ద్వారా అదనపు ఆదాయం
ఇక ఓటీటీ, ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా మరో 3 కోట్ల ఆదాయాన్ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.






