ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar)కు గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిన్నారి సింగపూర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మార్క్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలయింది. మార్క్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పలు వైద్య పరీక్షలు నిర్వహించాం. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో పలు ఇబ్బందులు తలెత్తాయి. వాటిపై పరీక్షలు చేస్తున్నాం. మరో మూడ్రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అని వైద్యులు తెలిపినట్లు జనసేన వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాయి.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
మార్క్ హెల్త్ బులెటిన్
ఇక తన కుమారుడు మార్క్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట సోదరుడు చిరంజీవి (Chiranjeevi) దంపతులు కూడా వెళ్లారు. మార్క్ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్‌కు తెలిపినట్లు సమాచారం. మరోవైపు పవన్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సానుభూతి ప్రకటిస్తున్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్
ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడికి జరిగిన ప్రమాదంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకున్నాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పిన తారక్.. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అని తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ సమయంలో పవన్ కుటుంబ సభ్యులంతా కూడా ధైర్యంగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు.






