పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది “పవర్ స్టార్”(Pawan star) అని. ఆయన అభిమానుల హృదయాల్లో ఈ బిరుదు పదేళ్లుగా చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమా ట్రైలర్ లాంఛ్(Trailar Lanch) ఈవెంట్‌లో నిర్మాత ఏఎం రత్నం(MM Ratham) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈవెంట్‌లో మాట్లాడిన రత్నం గారు, ‘‘ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌కి ‘పవర్ స్టార్’ అనే బిరుదే వాడారు. కానీ హరిహర వీరమల్లు సినిమా చూసిన తర్వాత ఇకపై ఆయనను ‘పవర్ స్టార్’ కాదు, ‘రియల్ స్టార్’(Real Star) అని పిలవాలి’’ అన్నారు. ఆయన వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిమానులు “రియల్ స్టార్ పవన్ కళ్యాణ్” అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడుతున్నారు.
ఇది మరింత ఆసక్తికరంగా మారింది, ఎందుకంటే హరిహర వీరమల్లు ట్రైలర్‌కి వచ్చిన స్పందన అలాంటిది మరి. పవన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రను ఇందులో పోషించాడు. ప్రత్యేకంగా ఆయన పెర్ఫార్మెన్స్‌కి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాకు ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉండడం, ట్రైలర్‌లో చూపిన విజువల్స్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజమైన పండుగే అని చెప్పొచ్చు. ట్రైలర్ భారీగా హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో సినిమా టాక్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి భారీగా పెరిగింది. మరి ‘పవర్ స్టార్’ నుంచి ‘రియల్ స్టార్’కి మారిన ఈ ప్రయాణం ఎలా ఉందో తెలియాలంటే జూలై 24 వరకూ ఆగాల్సిందే!
ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరవబోతున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ – జ్యోతికృష్ణ చేపట్టారు.






