PEDDI: శ్రీరామనవమి రోజు రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి సాలీడ్ అప్డేట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu Sana) తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

Peddi Glimpse : 'పెద్ది' గ్లింప్స్ కి దేవి హెల్ప్? | Ram charan peddi movie  update vm-10TV Telugu

శ్రీరామ నవమి కానుకగా..

ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్(Title), ఫస్ట్ లుక్ పోస్టర్స్( First Look Posters) రివీల్ చేయగా, ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ గ్లింప్స్ ‘పెద్ది ఫస్ట్‌షాట్’కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ గ్లింప్స్‌(Release Date Glimpse)ను ఏప్రిల్ 6న ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ గ్లింప్స్‌(Glimpse)కు సంబంధించిన మ్యూజిక్ మిక్సింగ్(Music Mixing) కూడా పూర్తయ్యిందని.. ఇక ప్రేక్షకులు ఈ ట్రీట్‌ను ఆస్వాదించడమే తరువాయి అనే విధంగా బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ కలిసి ఉన్న ఫొటోను మేకర్స్ తాజాగా సోషల్ మీడియా(SM)లో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్(Janhvi Kapoor) తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *