
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchibabu Sana) డైరెక్షన్లో వస్తున్న మూఈ ‘పెద్ది’ (Peddi). ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీ రోల్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. శనివారం శివరాజ్‌కుమార్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. శివన్న లుక్‌ను రివీల్ చేసింది. గౌర్నాయుడు పాత్రలో ఆయన కనిపించనున్నారని కొత్త పోస్టర్ విడుదల చేసింది.
హ్యాపీ బర్త్‌డే డియర్ శివన్న. మీలాంటి లెజండరీ ఆర్టిస్ట్, వినయం, సానుకూల దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తితో కలిసి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నా. సెట్‌లో మీ ప్రజెన్స్ ఎంతో ఎంతో స్ఫూర్తినిస్తోంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని డైరెక్టర్ బుచ్చిబాబు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
Happy Birthday to my Dear Shivanna @NimmaShivanna Sir 🤍🤗🫂
Truly honored to work with such a legendary, humble, and positive person like you, Sir❤️🙏
Your presence on set was always inspiring. Wishing you good health and immense happiness always sir.🤍🤗🙏 pic.twitter.com/24SR2Axadh— BuchiBabuSana (@BuchiBabuSana) July 12, 2025
రామ్‌చరణ్ నటిస్తున్న 16వ మూవీ పెద్ది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నాడు. విజయ్ సేతుపతి, త్రిష సైతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు బుచ్చిబాబు ఓ వేదికపై చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.