Mana Enadu : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం రోజున కువైట్ పర్యటనకు బయల్దేరారు. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సహబ్ (Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah) ఆహ్వానం మేరకు మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం బయల్దేరిన ఆయన పర్యటనకు ముందు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు షేర్ చేశారు.
కువైట్ కు ప్రధాని మోదీ
“ఇవాళ, రేపు కువైట్ లో నా పర్యటన (Modi Kuwait Visit News) కొనసాగుతుంది. ఆ దేశ టాప్ నేతలతో నేను చర్చలు జరపబోతున్నాను. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలపడుతుంది. రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక బంధం మరింత పెరగనుంది. ఈ పర్యటనలో నేను కువైట్ రాజును, ఆ దేశ ప్రధానితో భేటీ కాబోతున్నాను. అలాగే ఈ సాయంత్రం భారతీయ కమ్యూనిటీని కలవబోతున్నాను.” అని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
Today and tomorrow, I will be visiting Kuwait. This visit will deepen India’s historical linkages with Kuwait. I look forward to meeting His Highness the Amir, the Crown Prince and the Prime Minister of Kuwait.
This evening, I will be interacting with the Indian community and…
— Narendra Modi (@narendramodi) December 21, 2024
43 ఏళ్ల తర్వాత కువైట్ కు భారత ప్రధాని
సుమారు 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్ (PM Modi Kuwait Tour)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆ దేశంలోని అగ్ర నాయకులతో పాటు అక్కడున్న భారతీయులను కలవనున్న ఆయన.. భారత కార్మిక శిబిరాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో అరేబియా గల్ఫ్ కప్, ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవ్వనున్నట్లు తెలిసింది. మోదీ, కువైట్ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్లు సమాచారం.






