మరోసారి భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో జనం పరుగులు

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భూప్రకంపనలు (Earthquake) ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మరోసారి ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో పరుగులు పెట్టించేలా చేశాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం రోజున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.

భయంతో బయటకు పరుగులు

మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడులో స్వల్పంగా భూమి (AP Earthquake News) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి పని అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీశారు.  ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరిగెత్తారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు కూడా బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

4న భూప్రకంపనలు

ఈనెల 4వ తేదీన కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు (Telangana Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. 4వ తేదీ ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు.. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైనట్లు తెలిపారు. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్‌లోని CSIR – NGR శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *