ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆధ్వర్యంలో ద్వైపాక్షక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా భారత్, గయానా (Guyana) మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్యలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య 10 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత అధినేత గయానాలో పర్యటించడం 56 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మోదీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది.
హైడ్రో కార్బన్, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు, (UPI) రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధనం, ఫార్మా, వ్యవసాయం వంటి కీలక రంగాలపై ఒప్పందాలు చేసుకొని సహకరించకోవాలని నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక సమావేశం అనంతరం మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. భారత, గయానాల మధ్య మరింత సహకారం కోసం పలు రంగాలను గుర్తించామని ప్రధాని తెలిపారు. గయానాలోని ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అయ్యారు. అక్కడ వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని అభినందించారు.
మోదీకి అత్యన్నత పురస్కారం
గయానా, డమినికా దేశాలు నరేంద్ర మోదీని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. గయానా దేశం మోదీకి ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ భారత ప్రధానికి అందించారు. అంతకుముందుకు డొమినికా కూడా ప్రధానికి పురస్కారం అదించింది. కరోనా సమయంలో ఆ దేశానికి భారత్ అందించిన సహకారాన్ని గుర్తుచేసుకంటూ ఆ దేశ అధ్యక్షురాల సిల్వానీ బర్డన్ ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సన్మానించారు.