79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందా(Indus Waters Treaty)న్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు.
నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు” అని పునరుద్ఘాటించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్థాన్‌తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
నీటిపై మనకు, మన రైతులకు పూర్తి హక్కుంది
“మన భూములు దాహంతో అల్లాడుతుంటే, శత్రువుల నేలలను తడపడానికి మన నీటిని వాడుకున్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భారతదేశానికి చెందిన నీటిపై మనకు, మన రైతుల(Farmers)కు పూర్తి హక్కు ఉంటుంది. దేశ, రైతుల సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని మేం అంగీకరించడం లేదు” అని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా తేల్చిచెప్పారు. గత 75 ఏళ్లుగా భారత రాజ్యాంగం మనకు మార్గనిర్దేశం చేస్తోందని గుర్తుచేశారు. “వికసిత భారత్(Vikasit Bharat)” నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
“After the Pahalgam massacre on April 22, India was outraged and the world was shocked. Operation Sindoor was our response. Our forces were given a free hand-and they went deep into enemy territory, destroying terror HQs in Pakistan”
PM Modi during his #IndependenceDay2025… pic.twitter.com/IqpQXMuV5L
— News18 (@CNNnews18) August 15, 2025






