
పుష్ప-2 బెనిఫిట్ షో(Pushpa-2 Benefit Show) సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Incident) ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్(Sritej)ను పరామర్శించేందుకు రావొద్దంటూ అల్లు అర్జున్(Allu Arjun)కు రాంగోపాల్‌పేట్ నోటీసులు అందించారు. ఇవాళ (Jan 5) హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రాంగోపాల్‌పేట్ పోలీసులు(Rangopalpet Police) బన్ని మేనేజర్ మూర్తి(Manager Murthy)కి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల( law and order) దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని పేర్కొన్నారు. ఒకవేళ బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తమ సూచనలు పాటించాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే అల్లు అర్జునే బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో విచారణ నిమిత్తం బన్నీ కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
Police request Allu Arjun asked to avoid visiting Sri Tej at KIMS Hospital.
Due to the heightened public interest, the police advised actor Allu Arjun from visiting the victim of Sandhya Theater stampede. #AlluArjun𓃵 #SandhyaTheater#AlluArjunArrest #Telangana pic.twitter.com/uYHqrwcPoi
— Aristotle (@goLoko77) January 5, 2025
బాక్సాఫీస్ వద్ద కలెక్షన సునామీ
ఇక ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’ అంటూ వచ్చిన అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. లెక్కల మాస్టార్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే మూవీ రిలీజ్ అయి నెల రోజులు పూర్తి చేసుకుంది. దీంతో బన్నీ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు, హిందీ వెర్షెన్లలో వసూళ్లు కొల్లగొడుతోంది. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
దేశవ్యాప్తంగా రూ.1,200 కోట్ల మైలురాయి క్రాస్
తాజాగా పుష్ప2 విడుదలై నెలరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌లో రూ.1 కోటి, హిందీ వెర్షన్‌లో రూ. 4.35 కోట్లు, తమిళం, కన్నడ వెర్షన్లలో కలిపి రూ.15 లక్షలు కొల్లగొట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,200 కోట్ల మైలురాయిని క్రాస్ చేసిందని ‘శాక్‌నిల్క్(Sacknilk)’ పేర్కొంది. ఇక ఇవాళ (జనవరి 5) ఆదివారం కావడం, థియేటర్లలో ఇతర చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో పుష్ప-2 వసూళ్లు గణనీయంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
#WATCH | Telangana: Actor Allu Arjun reaches Chikkadpally police station in Hyderabad.
Allu Arjun submitted the sureties at Metropolitan Criminal Court at Nampally yesterday after he was granted regular bail by the Court in the Sandhya Theatre incident case. pic.twitter.com/tVRUPezLVy
— ANI (@ANI) January 5, 2025