Saif Ali Khan: సైఫ్‌ కత్తిదాడి కేసులో ట్విస్ట్.. నిందితుడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై కత్తిదాడి కేసులో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడే అసలైన నేరస్థుడు అంటూ గట్టిగా నమ్మిన పోలీసులే.. అతడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్(Facial RecognitionTest) నిర్వహిస్తామంటూ మరోసారి కస్టడీ(Custody) కోరారు. దాడి జరిగిన రోజు CCTVలో కనిపించిన అతను, పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు ఒకరేనా కాదా అని తేల్చేందుకే ఈ పరీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. అసలు నిందితుడు ఇతడేనా, కాదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 16వ తేదీ రోజు వేకువజామున 2.30 గంటలకు బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఇతడే నిందితుడు(Accused) అంటూ ఓ వ్యక్తి ఫొటో(Photo)ను కూడా విడుదల చేశారు.

విచారణ పూర్తి కావడంతోనే..

అయితే ఇలా ఫొటో విడుదల చేసిన 2 రోజుల తర్వాత పోలీసులు(Police) అతడిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌(Bangladesh)కు చెందిన షరీఫుల్ ఇస్తాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌ను.. థాణే అటవీ ప్రాంతంలో ఉన్న ఓ లేబర్ క్యాంపు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(Mumbai Metropolitan Magistrate) ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే అతడిని మరింతగా విచారించాలని కోరుతూ.. పోలీసులు కస్టడీ కోరారు. దీంతో కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఐదు రోజులు నేటితో పూర్తి కావడంతో మరోసారి నిందితుడిని కోర్టు(Court)లో హాజరు పరిచారు.

అది తేల్చేందుకే ఈ పరీక్ష: పోలీసులు

కానీ పోలీసులు ఈరోజు కోర్టు ముందు షాకింగ్ కామెంట్లు చేశారు. నిందితుడైన బంగ్లాదేశీయుడికి(Bangladeshi man) ఫేస్ రికగ్నేషన్ టెస్ట్ చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు. దాడి జరిగిన రోజు CCTV ఫుటేజీలో కనిపించిన వ్యక్తి, అరెస్టైన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్(Shariful Islam Shehzad) అలియాస్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ ఒక్కరేనా కాదా అని తేల్చేందుకు ఈ పరీక్ష చేస్తామన్నారు. దీంతో మరోసారి కోర్టు 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *