Pooja Hegde : రజినీకాంత్ ‘కూలీ’లో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలింది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఈ బ్యూటీ క్యాల్షీట్ల కోసం వేచి చూసేవారు. కానీ వరుసగా సినిమాలు ప్లాఫ్ కావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవలే హిందీలో ‘దేవా (Deva)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఓ తమిళ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా తలైవా, సూపర్ రజనీకాంత్ (Rajinikanth) సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

కూలీలో పూజా హెగ్డే

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ (Coolie)’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna), కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Hasaan) నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు.

కోలీవుడ్ పై బుట్టబొమ్మ ఫోకస్

తాజాగా కూలీ చిత్రబృందం పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కూలీ మూవీలో పూజ కూడా భాగమైనట్లు నెట్టింట ఓ పోస్టు పెట్టింది. ఇక పూజకు టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. అక్కడ ఈ భామకు వస్తున్న అవకాశాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇటీవలే సూర్య (Suriya), కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రో (Retro)కు ఓకే చెప్పింది పూజ. ఇక తాజాగా లారెన్స్ డైరెక్షన్లో వస్తున్న కాంచన-4 (Kanchana -4)లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడేమో కూలీలో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమాలో ఈ బ్యూటీ పాత్ర గురించి ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *