Pooja Hegde: పాపం.. బుట్టబొమ్మ! ధనుష్ మూవీ నుంచి ఔట్.. రీజన్ అదేనా?

2012లో మాస్క్(Mask) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, బుట్టబొమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). ఆ తర్వాత ఒక లైలా కోసం(Oka Laila Kosam), ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, F-3, బీస్ట్, ఆచార్య(Acharya), రాదేశ్యామ్ వంటి సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. చాలా రోజులు సౌత్ ఇండస్ట్రీ(South Industry)లో టాప్ హీరోయిన్‌గానూ వెలుగొందిన పూజా హెగ్డేకు ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపుల కారణంగా ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది.

Will Pooja Hegde join Dhanush in Vignesh Raja's film?

వరుస డిజాస్టర్లే కారణమా..

ఈ ప్రభావం తాజాగా ఆమెకు దక్కాల్సిన ఓ క్రేజీ ఆఫర్‌పై పడింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Kollywood Star Dhanush) #D54లో సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ బ్యూటీ మమితా బైజు(Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు కెరీర్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో పూజా హెగ్డే దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా భారీ రెమ్యునరేషన్(Remunaration) అందుకున్నారు. అయితే ‘రాధే శ్యామ్(Radhe Shyam)’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ నుంచి ఇటీవల వచ్చిన ‘రెట్రో’ వరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

‘ప్రేమలు’ సినిమాతో..

దీంతో ఆమె క్రేజ్ కొంతమేర తగ్గింది. ఈ నేపథ్యంలోనే ధనుష్ హీరోగా దర్శకుడు విగ్నేష్ రాజా(Director Vignesh Raja) తెరకెక్కించనున్న కొత్త సినిమా కోసం మొదట పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆమెను పక్కనపెట్టి, ‘ప్రేమలు(Premalu)’ సినిమాతో సెన్సేషన్ అయిన మమితా బైజును ఫైనల్ చేశారని కోలీవుడ్(Kollywood) వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *