ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన పూజా హెగ్డే(Pooja Hegde), గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను చవిచూశాయి. ముఖ్యంగా సూర్య నటించిన రెట్రో చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నా, అది కూడా నిరాశే మిగిల్చింది.
అయితే తాజాగా పూజా హెగ్డే కూలీ( Coolie movie) సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో, “మోనికా”(Monica song) అంటూ సాగే మాస్ సాంగ్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. పోర్ట్ ఏరియాలో గ్రూప్ డ్యాన్స్‌గా చిత్రీకరించిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. పూజా హెగ్డే డ్యాన్స్ స్టెప్పులు, గ్లామర్ ప్రెజెన్స్ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ కూడా తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
ఈ పాటకు సంబంధించి పూజా తీసుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఈ ఒక్క పాట కోసం పూజా హెగ్డే రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినిమాకు నాలుగైదు కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఆమె, ఈ ఒక్క పాటకే మూడు కోట్లు తీసుకోవడం గమనార్హం. కూలీ సినిమాలో రజనీతో పాటు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా, ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది.






