నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌గా గతంలో ‘రుద్ర(Rudra)’ అని వినిపించింది. కానీ ఆ పేరు ప్లేసులో తాజాగా మరో పేరు ‘అర్జున్ S/o వైజయంతి’ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆలనాటి సీనియర్ నటి విజయశాంతి(Vijayashanti) ఈ సినిమాలో వైజయంతిగా నటిస్తుండటమే. మీరు విన్నది నిజమే ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆమె ఇమేజ్‌ను కరెక్ట్‌గా వాడలేదు ఆ మూవీ డైరెక్టర్. కానీ ఈ సారి ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతోందని ఆ మధ్య వచ్చిన ఆమె బర్త్ డే గ్లింప్స్(Glimpse) చూస్తేనే అర్థమైంది.
విజయశాంతి కొడుకుగా కళ్యాణ్ రామ్
ప్రస్తుతం NKR21 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే రివిల్ అయిన టైటిల్‌ను బట్టి కళ్యాణ్ రామ్(KalyanRam) విజయశాంతి కొడుకుగా నటిస్తున్నాడు అని తేలిపోయింది. తల్లీకొడుకుల మధ్య రిలేషన్‌ను కూడా ఈ మూవీలో కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కళ్యాణ్ రామ్ సరసన సాయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి(Director Pradeep Chilukuri) డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు. సినిమాను వేసవి బరిలో మే 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి “S/o సత్యమూర్తి”లాగా “అర్జున్ S/o వైజయంతి” కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.






