విషాదం.. 270 కేజీల బరువు ఎత్తే క్రమంలో వెయిట్‌లిఫ్టర్ మృతి

క్రీడాకారులు ఎవరైనా సరే దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఉవ్విళూరుతుంటారు. అందుకోసం కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లకు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అవకాశాలు లభించవు. మరికొందరికి అదృష్టం కొద్దీ అవకాశాలనే వారిని వెతుక్కుంటూ వస్తుంటాయి. కానీ దేశం గర్వించేలా చేసే ప్రయత్నాలలో ఆటుపోట్లు తప్పకుండా ఎదురవుతాయి. కానీ ఒక్కోసారి తమ ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పవర్ లిఫ్టింగ్‌(Powerlifting)లో రాణించాలని అనుకున్న 17 ఏళ్ల యస్తికా ఆచార్య(Yashtika Acharya) జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..

కోచ్‌ పర్యవేక్షణలోనే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని బికనీర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. బడా గణేష్‌ జీ టెంపుల్‌ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్‌ జిమ్‌(Gym)లో యస్తిక ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యస్తిక తన కోచ్‌ పర్యవేక్షణలో 270 కేజీల బరువు(lifting Heavy weight )ను లిఫ్ట్‌ చేయడానికి ప్రయత్నించింది. అయితే, అనూహ్యంగా బ్యాలెన్స్‌ తప్పి ఆ భారీ బరువు నేరుగా ఆమె మెడపై ఒక్కసారిగా పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. ఆమెకు నివాళులు అర్పిస్తూ క్రీడా రంగ ప్రముఖులు, శిక్షకులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

పవర్ లిఫ్టింగ్‌లో అసాధారణ ప్రతిభ

కాగా చిన్న వయసులోనే యస్తిక పవర్ లిఫ్టింగ్‌(Powerlifting)లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. 29వ రాజస్థాన్‌ స్టేట్‌ సబ్-జూనియర్‌ & సీనియర్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌, 33వ నేషనల్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌(Gold Medal) సాధించింది. ఆమె కుటుంబ సభ్యుల ప్రకారం, యస్తిక క్రీడా రంగంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కలలు కనింది. కానీ ఈ అనూహ్య ప్రమాదం ఆమె జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *