ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా టైటిల్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఎనిమిది ప్రాజెక్టులున్నాయి. ఇటీవలే హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)తో ప్రభాస్ ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట. అయితే ఈ మూవీకి బ్రహ్మరాక్షస్ అనే టైటిల్ పెట్టనున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ చిత్రానికి మరో కొత్త టైటిల్ పెట్టాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. మరి ఆ టైటిల్ ఏంటంటే..?

బకాసురిడి కథతో ప్రభాస్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే హను-మాన్ (Hanu Man) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మరో 11 సినిమాలు ఈ యూనివర్స్ లో భాగంగా వస్తాయని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హను-మాన్ సీక్వెల్ గా జై హనుమాన్ (Jai HanuMan) మూవీని తీస్తున్నాడు. ఇక మన పురాణాలను నేటి తరానికి చెప్పాలని ఎంతో ఆరాటపడే ప్రశాంత్ వర్మ తాజాగా మహా భారతంలోని ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ నేపథ్యంతో సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

బ్రహ్మరాక్షస్ కాదు బక

మహాభారతంలోని బకాసురుడి కథ (Bakasurudu) ఆధారంగా ప్రశాంత్ వర్మ తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ప్రభాస్ కు ఈ కథనే వినిపించగా అందులో నటించేందుకు డార్లింగ్ ఓకే చెప్పాడట. అయితే మొదట బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ అనుకున్నా తాజాగా ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు బక అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ నిర్ణయించారట. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్ ‘బక (BAKA)’ సినిమా చేయడానికి ఓకే చెప్పాడంటే తనకు కథ బాగా నచ్చినట్లుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *