‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ (Prabhas) తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజులోనే తీస్తున్నాడు. అలా ఇటీవల సలార్, కల్కి (Kalki) చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం డార్లింగ్ ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ జరుగుతోంది. సీతారామం ఫేం హను రాఘవపూడితో ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న సినిమా కూడా ప్రారంభమైంది.
ఉగాది రోజున స్పిరిట్ ప్రారంభం
ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్.. యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్ (Spirit)’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ కాప్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి హింట్ ఇచ్చాడు. ప్రభాస్, సందీప్ ల కాంబోలో వస్తున్నందున ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డ్యూయల్ రోల్ లో ప్రభాస్
అయితే స్పిరిట్ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తెలిపారు. ఉగాది పర్వదినాన స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమం ఉంటుందని, వీలైతే అదే రోజున షూటింగ్ కూడా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ బాగా వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది.






