డార్లింగ్ ప్రభాస్(Prabhas), దర్శకుడు మారుతీ(Maruthi) కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ది రాజాసాబ్(The Raja Saab). డిఫరెంట్ కాంబో కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు కొండెక్కాయి. కొందరు ఈ కాంబో సెట్ కాకపోవచ్చు అని కామెంట్స్ చేసినా కూడా, సినిమా అప్ డేట్స్ కొన్ని వదిలి ఆ కామెంట్లను తుక్కు తుక్కు చేశారు మారుతి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్ డేట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ లుక్, కామెడీ టైమింగ్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజా వార్తల ప్రకారం, సినిమా స్పెషల్ అట్రాక్షన్‌గా ఒక ఐటెం సాంగ్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ పాటలో బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్‌ను (Kareena Kapoor)తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇదే నిజమైతే ప్రభాస్, కరీనా కాంబో స్క్రీన్ మీద ఒక పండుగే అని చెప్పొచ్చు.
ఈ సాంగ్ కేవలం ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసారని, ప్రభాస్ ఎనర్జీ, డ్యాన్స్, కరీనా గ్లామర్ ప్రేక్షకులను థియేటర్‌లో ఊపేస్తాయని టాక్. త్వరలోనే ఈ పాట షూట్ మొదలవుతుందని సమాచారం. యాక్షన్ సినిమాలతో ఓ దశలో బోర్ కొట్టిన ప్రభాస్.. ఈసారి మారుతీ దర్శకత్వంలో కామెడీ, హర్రర్, థ్రిల్లర్ మిక్స్‌తో కొత్తగా అలరించేందుకు వస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం అన్ని వర్గాల ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.






