ప్రభుదేవా వారసుడొచ్చాడు.. వీడియో చూశారా?

ఇండియన్ మైఖేల్ జాక్సన్.. డ్యాన్స్ కీ దేవా.. ప్రభుదేవా (Prabhu Deva) గురించి తెలియని వారుండరు. ఇటు సౌత్ ఇండియా, అటు నార్త్ ఇండియా.. హోల్ ఇండియాలో డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రభుదేవాదే. ఎందరో మహా నటులతో స్టెప్పులు వేయించాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అంటే హీరోలు కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతటి గొప్ప పేరు సంపాదించుకున్న ఈ డ్యాన్స్ కొరియోగ్రఫర్ వారసుడు ఎవరనేది ఎప్పుడూ చర్చకు రాలేదు. కానీ తాజాగా ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేశారు.

ప్రభుదేవా వారసుడొచ్చాడు

చెన్నైలో ‘ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ (Prabhu Deva Live Dance Vibe)’ పేరుతో ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వివిధ సినిమా రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలోనే ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేశారు. తన కుమారుడు రిషి రాగ్వేందర్ దేవా (Rishi Ragvendar Deva)ను పరిచయం చేసిన ప్రభుదేవా అతడి ఫస్ట్ స్టేజ్ పర్ఫామెన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. మరి మీరు కూడా చూసేయండి ఓసారి.

 

View this post on Instagram

 

A post shared by Keerthi Balaji (@balaji2keerthi)

ఇది అంతకంటే ఎక్కువ

ఇక ఈ వీడియో పోస్టు చేసిన ప్రభుదేవా దానికింద ఓ ఎమోషనల్ పోస్టు రాసుకొచ్చారు. ‘నా కుమారుడు రిషి రాగ్వేందర్ దేవాను మీ అందరికి పరిచయం చేయడం చాలా గర్వంగా ఉంది. మేమిద్దరం కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఇది కేవలం మా డ్యాన్స్ పర్ఫామెన్స్ కాదు. అంతకంటే ఎక్కువ. ఇది నా వారసత్వం. ఇప్పుడే మొదలవుతున్న నా వారసుడి జర్నీ. దీనికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’ అని ప్రభుదేవా రాసుకొచ్చారు. ఇక ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు రిషి రాగ్వేందర్ కాగా.. మరొకరు అదిత్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *