‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప (Kannappa)’. మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో విష్ణు నటిస్తున్నాడు. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటులు ఇందులో చాలా ప్రధానమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

మార్చి 1న కన్నప్ప టీజర్

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కన్నప్ప టీమ్ ప్రేక్షకులకు ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. మార్చి 1వ తేదీన కన్నప్ప సినిమా టీజర్ (Kannappa Teaser Date) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి శివ శివ శంకరా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

శివపార్వతులుగా అక్షయ్, కాజల్

ఇక కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. శివపార్వతులుగా అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ప్రభాస్ ఇందులో రుద్ర అనే కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు తనయుడు మంచు అవ్రామ్ (Manchu Avra,) ఈ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన కుమార్తెలు అరియానా, వివియానా కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *