
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఛావా (Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utekar) తెరకెక్కించిన ఈ సినిమాను మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ (Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
రూ.400 కోట్ల క్లబ్ లోకి ఛావా
ఛావా (Chhaava Collections) సినిమా ఇప్పటి వరకు రూ.370 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమా హిందీలోనే విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ చూసి ఈ సినిమాను ఎలాగైనా చూడాలని మిగతా భాషల వారు, ముఖ్యంగా తెలుగు వారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు భాషలో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.
మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్
ఈ క్రమంలో మేకర్స్ స్పందించారు. ఛావా తెలుగు వెర్షన్ (Chhaava Telugu Version Release) ను రిలీజ్ చేస్తే మరింత మార్కెట్ పెరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో రిలీజ్ చేయాలని భావించారు. తెలుగు బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను మార్చి 7వ తేదీన తెలుగులో విడుదల చేయడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ జరుగుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ పాత్రకు టాలీవుడ్ స్టార్ హీరోతో డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలిసింది.