
ముంబయి బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఇటీవలే ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత బాలకృష్ణతోనే మరో సినిమా అఖండ-2లోనూ నటిస్తోంది. అలా ఈ ఏడాది ఈ బ్యూటీ వరుస అవకాశాలతో జోరు మీద ఉంది. అఖండ-2 (Akhanada 2) పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా సక్సెస్ అయితే ఈ భామకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఇదే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘టైసన్ నాయుడు’లోనూ ఛాన్స్ కొట్టేసింది.
మాస్ రోల్ లో ప్రగ్యా
ఇక తాజాగా ఈ అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వరించినట్లు తెలిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchchi Babu ) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం (RC16)లో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో అఖండ ఫేం ప్రగ్యా జైస్వాల్ ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఇందులో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.
అనసూయ ఔట్.. ప్రగ్యా ఇన్
అయితే మొదట ఈ పాత్ర కోసం యాంకర్ అనసూయ (Anasuya)ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ ఇప్పటికే అనసూయ సుకుమార్-రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్త వంటి మాస్ పాత్రతో ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఆమెను మాస్ రోల్ లో తీసుకుంటే ఫ్రెష్ ఫీల్ రాదని భావించి ఈ పాత్రకు ప్రగ్యాను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా గనుక ఓకే అయితే ప్రగ్యా దశ తిరిగినట్లేనని నెటిజన్లు అంటున్నారు.