
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ (Salman Khan), సంజయ్ దత్ (Sanjay Dutt) చాలా రోజుల తర్వాత వెండితెరపై కలిసి కనిపించబోతున్నారు. ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు బీ టౌన్ స్టార్స్ ముందుకొచ్చారు. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ‘సెవెన్ డాగ్స్ (Seven Dogs)’ రీమేక్‌లో ఈ ఇద్దరు ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోంది.
హాలీవుడ్ లో సల్లూ భాయ్ క్యామియో
ఈ నేపథ్యంలో ఈ షూట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ (Salman Hollywood Movie) ఆటో డ్రైవర్ యూనిఫామ్ లో కనిపించాడు. సల్లూ భాయ్ పక్కనే సూట్ ధరించిన సంజయ్ దత్ నిలబడి ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించలేమని ఇటీవలే నిర్మాతలు తెలిపారు.
Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥… #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4
— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025
అక్కడ సల్లూ, సంజయ్ లకు ఫాలోయింగ్
మిడిల్ ఈస్ట్‌లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ ఏరియాలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా వారిద్దరిని క్యామియో రోల్స్ కు ఎంపికి చేసినట్లు తెలిసింది. ఇక బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కలిసి గతంలో ‘సాజన్ (Saajan)’ ‘ఛల్ మేరే భాయ్’ ‘యే హై జల్వా’ అనే చిత్రాల్లో కలిసి నటించారు. ఇక గతేడాది ‘ఓల్డ్ మనీ (Old Money)’ అనే ఓ పాటలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇక సల్మాన్ తాజాగా సికందర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…