Hari Hara Veera Mallu : ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్‌ ప్రోమో రిలీజ్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమా నుంచి తరచూ అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో పాట ప్రోమో విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro)’ పాట ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 24న సాయంత్రం 3 గంటలకు ఈ పాటను మొత్తం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

చిచ్చర పిడుగంటివాడు

‘కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె ఝనుకులతో కొలిమిలాంటి మగతిమితో.. సరసర వచ్చినాడు చిచ్చరపిడుగంటివాడు’ అంటూ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ ఈ పాట సాగింది. ఇక ఈ పాటలో అనసూయ (Anasuya), పూజిత పొన్నాడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ పాటను మంగ్లీ, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మార్చి 28వ తేదీన ఈ సినిమా పార్ట్‌ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) నటిస్తోంది.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *