
‘ఇండియాస్ గాట్ లాటెంట్’(IGL) కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇదే వ్యవహారంలో తాజాగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant)కు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఫిబ్రవరి 27వ తేదీన మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
అందరికీ నోటీసులు
అయితే రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన ఎపిసోడ్ లో రాఖీ సావంత్ (Rakhi Sawant) పాల్గొనలేదు. అయినా ఈ కేసుకు సంబంధించి ఈ షోలో గతంలో నిర్వహించిన ఎపిసోడ్ లలో అతిథులుగా హాజరైన వారికి కూడా నోటీసులు ఇస్తున్నట్లు ఐజీ యశస్వి యాదవ్ తెలిపారు. ఈ షోలోని అన్ని ఎపిసోడ్‌లలో పాల్గొన్న వారందరి పైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో నటులు, నిర్మాతలు సహా మొత్తం 42 మందికి సమన్లు జారీ చేసినట్లు పేర్కన్నారు.
ఇదీ జరిగింది..
ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొందరు ఎంపీలు కూడా ఈ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయ్ రైనా షోలో రణ్‌వీర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అతడిపైనా పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…