
శ్రీరామ్, నందినీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘మాతృ’. జాన్ జక్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుగి విజయ్, రూపాలి భూషణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్‌తో సాగిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మదర్ సెంటిమెంట్ సాంగ్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జోరు పెంచి తాజాగా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఈ అపరంజి బొమ్మ.. మా అమ్మ అనే పాటను దినేశ్ రుద్ర పాడారు. బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ కు.. శేఖర్ చంద్ర బాణీలందించారు.
హృదయాల్ని హత్తుకునే పాట
ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా నిర్మాతే ఇంతటి పాటను రాయడం విశేషం. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…