
టాలీవుడ్ నటుడు ఆదిత్య ఓం (Aditya Om) చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్-8లో మెరిసిన ఈ నటుడు తాజాగా ‘బంధీ (bandi)’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. రఘు తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ ఈ సినిమా ఉండనుంది.
బంధీ సినిమాకు ప్రశంసలు
గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవాల్లో బంధీ చిత్రానికి అనేక ప్రశంసలు దక్కాయి. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా బంధీ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోంది. భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు.
అద్భుతమైన విజువల్స్
అద్భుతమైన విజువల్స్‌ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది. ఎంతో డెడికేటెడ్ యాక్టర్ అయిన ఆదిత్య ఓం బంధీ చిత్రంలో ఎన్నో రియల్ స్టంట్స్ చేశారు. అటవీ ప్రాంతంలో అనేక ఛాలెంజ్‌లు ఎదుర్కొంటూ అద్భుతంగా నటించారు. ఈ మూవీని ఇక ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం NGOలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు.