మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. అంజనాదేవి హెల్త్ పై ‘మెగా’ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై ఇవాళ పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హైబీపీతో ఆస్పత్రిలో చేరారంటూ పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన మాతృమూర్తి అంజనాదేవి (Anjana Devi) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతూ.. ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

అవాస్తవాలు రాయొద్దు

“మా అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొన్ని వార్తలు వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. రెండు రోజులుగా ఆమె ఒంట్లో కాస్త నలతగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.  ఆమె ఆరోగ్యానికి సంబంధించి, దయచేసి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. ఈ విషయంలో నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. అవాస్తవాలు ప్రచారం చేయకండి. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అంటూ చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు.

అమ్మ ఆరోగ్యంగా ఉంది

ఇక అంజనాదేవి ఆరోగ్యంపై ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో దీనిపై చిరంజీవి టీమ్‌ ఇప్పటికే క్లారిటీ ఇస్తూ.. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వివరించింది. తాజాగా చిరంజీవి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Related Posts

Uppu Kappurambu: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కీర్తి సురేష్(Keerthy Suresh), సుహాస్(Suhaas) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు ఒరిజినల్ చిత్రం ‘ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu)’ డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ఇవాళ్టి (జులై 4) నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. 90వ దశకంలోని చిట్టి జయపురం(Chitti Jayapuram)…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *