టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పవన్ చాలా మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన (Prakash Raj) రాజకీయాలు, ఇతర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?

అధికారం రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు తిరుపతి లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy)పై స్పందిస్తూ అది చాలా సున్నితమైన అంశమని.. భక్తుల మనోభావాలకు సంబంధించిందని కాబట్టి సరైన ఆధారాలున్నప్పుడే జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదేం తొలిసారి కాదు

సనాతన ధర్మాని (Sanatana Dharma)కి తాను వ్యతిరేకిని కాదని మరోసారి ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. లడ్డూ వివాదం విషయంలో గతంలోనూ పవన్‌ కళ్యాణ్ ను ఉద్దేశించి జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు చేశారు. అయితే ఆయా పోస్టులపై ఆ సమయంలో పవన్‌ కూడా స్పందించారు. ప్రకాశ్‌ రాజ్‌ తనకు మిత్రుడే అయినా ఈ వివాదం విషయంలో ఆ విధంగా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *