Nani’s The Paradise: మాస్‌ లుక్‌లో నాని.. ‘ది ప్యారడైజ్’ నుంచి ‘జడల్’ వచ్చేశాడు..

నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్(The Paradise)’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్( first look poster) విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రూపొందిస్తున్న ఈ చిత్రం, ‘దసరా’ విజయం తర్వాత నాని-శ్రీకాంత్ కాంబోలో రాబోతున్న రెండో చిత్రం. కాగా ‘ది ప్యారడైజ్’ నుంచి రిలీజ్ అయిన ఈ పోస్టర్‌లో నాని విభిన్నమైన గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన ‘జడల్‌(Jadal)’ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసింది’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతోపాటు… మొత్తం 8 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

1980-90ల సమయంలో సాగే కథగా..

హైదరాబాద్(Hyderabad) గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో 1980-90ల సమయంలో సాగే కథగా ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రెండో లుక్ ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *