భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం(79th Independence Day) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort in Delhi) వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) జాతీయ జెండా(National Flag)ను గర్వంగా ఎగురవేశారు. వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. తొలుత రాజ్‌ఘాట్(Rajghat) వద్ద మహాత్మా గాంధీ, ఇతర అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు. మహానగరం యావత్తు కెమెరా నిఘాను పటిష్ఠం చేశారు.
Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay
(Video Source: DD) pic.twitter.com/4yQ03Fi1KW— సందీప్ ఎరుకల Sandeep Erukala (@ESandeep97) August 15, 2025
పూలవర్షం కురిపించిన MI-17 హెలికాప్టర్లు
కాగా ‘నయా భారత్(Naya Bharat)’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ జెండా ఎగురవేస్తున్న సమయంలో రెండు MI-17 హెలికాప్టర్లు ఇక్కడ పూలవర్షం కురిపించాయి. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు, కేంద్ర మంత్రులు, సైనిక దళాల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఆయన, జాతిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు.
స్వాతంత్ర్యం ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం
ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. “ఈ రోజు మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే, అది ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం. వారి ఆశయాలను సాకారం చేయడం మన బాధ్యత” అని అన్నారు. ఆయన భారతదేశ ప్రగతి, ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, ప్రపంచ వేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను వివరించారు. “2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు మనం కలిసి పనిచేయాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు.
ఎర్రకోట చారిత్రక ప్రాముఖ్యత గుర్తుచేస్తూ..
ఎర్రకోట చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, 1947లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) ఇక్కడే తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారని, అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. ప్రధాని ప్రసంగంలో యువతను ఉత్తేజపరిచే అంశాలు, స్త్రీ శక్తి, రైతుల సంక్షేమం(Farmers’ welfare), పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరిగాయి, దేశ ఐక్యతను, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ జాతీయ గర్వాన్ని చాటాయి.
#WATCH LIVE | PM @narendramodi begins his address on the 79th #IndependenceDay
PM Modi says, “This Diwali, I am going to make it a double Diwali for you. This Diwali, the people of the country are going to receive a big gift. Over the past eight years, we have undertaken a… pic.twitter.com/eSKoefubU7
— DD India (@DDIndialive) August 15, 2025






