
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbha Mela)ను ప్రధాని మోదీ(PM Modi) సందర్శించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి UP సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాగకి చేరుకున్నారు. అక్కడి అరైల్ ఘాట్(Arile Ghat) నుంచి సంగం ఘాట్(Sangam Ghat) వరకూ ప్రధాని పడవలో వెళ్లారు. అనంతరం త్రివేణీ సంగమం(Triveni Sangamam) వద్ద మోదీ పుణ్య స్నానమాచరించారు. గంగాదేవికి ప్రార్థనలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం నాగసాధువులు, సాధుసంతు సభ్యులతో ప్రధాని సమావేశమయ్యారు.
కాషాయ వస్త్రాలు.. రుద్రాక్ష మాలను ధరించి
కాగా మోదీ స్నానం చేసే సమయంలో కాషాయ వస్త్రాలు.. రుద్రాక్ష మాలను ధరించి స్నానమాచరించారు. భీష్మాష్టమి(Bhishmashtami) రోజున మోదీ కుంభమేళాకు రావడం విశేషం. కాగా అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీ(Delhi)కి తిరుగు ప్రయాణం అవుతారు.
MOMENT OF THE DAY –
Prime Minister Narendra Modi takes holy dip in Sangam at Prayagraj Mahakumbh. pic.twitter.com/OZinjd4f6M
— News Arena India (@NewsArenaIndia) February 5, 2025
ఇదిలా ఉండగా జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 40 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
PM Modi offers prayers at Triveni Sangam in Prayagraj
Read @ANI Story | https://t.co/HlfXgvzbFJ#PMModi #Mahakumbh2025 #prayagraj pic.twitter.com/sfECAQMPv7
— ANI Digital (@ani_digital) February 5, 2025