సలార్‌తోపాటు పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘సర్జమీన్’ (Sarzameen). పృథ్వీరాజ్‌కు భార్యగా సీనియర్ నటి కాజోల్ (Kajol) నటిస్తోంది. అయితే బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తాడని భావించిన సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ఇందులో టెర్రరిస్ట్ గా విలన్ రోల్ పోషిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జులై 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
Loved it. #Sarzameen trailer pleasantly surprised me.https://t.co/C9ALWAN58n
— Navneet Mundhra (@navneet_mundhra) July 4, 2025
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించగా.. ఆయన భార్య మీరా పాత్రలో కాజోల్ నటించారు. వారి కుమారుడు ఇబ్రహీం చిన్నతనంలోనే ఇంట్లో నుంచి పారిపోయి ఉగ్రవాదిగా మారనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌గా, కొడుకు ఉగ్రవాదిగా సాగే చిత్రంగా కనిపిస్తోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీని కాయోజే ఇరానీ(Kayoje Irani) డైరెక్ట్ చేస్తున్నారు. ఆసక్తిని రేపుతున్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.






