Schools Holiday: ఏపీలో నేడు ఆ స్కూళ్లకు సెలవు.. ఎందుకో తెలుసా?

ఏపీ(Andhra Pradesh)లోని ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా నేడు (జులై 3) రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను మూసివేసినట్లు ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘాలు(AP Private School Owners Associations) ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప ప్రభుత్వాని(Government)కి వ్యతిరేకం కాదని వెల్లడించాయి. ‘‘కొందరు క్షేత్రస్థాయి అధికారుల(field officers) నుంచి వచ్చే అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలను నిత్యం తనిఖీలు(Regular inspections) చేయడం, యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నాయి.

ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నప్పటికీ

అంతేకాకుండా, ‘‘ఆర్టీఈ ప్రవేశాల్లో(Right to education) తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేస్తున్నారు. పాఠశాలలను షోకాజ్‌ నోటీసుల(Show cause notices)తో వేధించడం సహా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం లాంటి చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలలను ఒకరోజు మూసివేయాలని నిర్ణయించాం’’ అని ప్రైవేటు యాజమాన్యాలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నప్పటికీ కొంతమంది అధికారుల తీరు సరిగా ఉండటం లేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్ల(Demands)ను పరిగణలోకి తీసుకోని ప‌రిష్కారం మార్గం చూపాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. పాఠశాలలపై నియమించిన కమిటీలు, తనిఖీలు అమలు చేయటం విచారకరమని పేర్కొంటున్నాయి.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *