
ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు #SSMB29. మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించనున్న ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇక ఈ మూవీలో మహేశ్ సరసన హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో ప్రియాంకా చోప్రా
అయితే తాజాగా ఈ వార్త నిజమేనని రుజువు చేసేలా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ లో కనిపించింది. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రియాంకా ఎయిర్ పోర్టు వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
జక్కన్న సినిమాలో విదేశీ నటులు
ప్రియాంకా చోప్రా రాకతో ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల (Amazon Forest) నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు ఫారిన్ నటులు నటించనున్నట్లు సమాచారం.
BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu – Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2025
సరికొత్త లుక్ లో మహేశ్ బాబు
దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్ (Mahesh Babu) కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన లుక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘హాలీవుడ్‌కు జేమ్స్ బాండ్ ఎలానో.. టాలీవుడ్‌కు మహేశ్ అలాగా. ఈ సినిమా అలవోకగా రూ.1000 కోట్లు సాధిస్తుందని అన్నారు.