Priyanka Mohan: జయం రవి, ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్.. హీరోయిన్ క్లారిటీ!

Mana Enadu: విడాకుల వార్తలతో ఇటీవల వార్తల్లోకి నిలిచిన కోలీవుడ్ నటుడు జయం రవి, నటి ప్రియాంక మోహన్‌(Jayam Ravi and actress Priyanka Mohan)ను పెళ్లాడబోతున్నట్టు వార్తలొచ్చాయి. వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్నట్టు చెబుతూ ఇద్దరూ పూల దండలు వేసుకుని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయింది. తాజాగా, ఈ వార్తలపై ప్రియాంక స్పందించారు.

 ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని అన్నారు. తామిద్దరం ‘బ్రదర్’ సినిమా(Brother movie) కోసం కలిసి పనిచేశామని, ఆ సినిమా ప్రమోషన్‌(Promotions)లో భాగంగా చిత్ర బృందం ఈ ఫొటోను రిలీజ్ చేసినట్టు తెలిపారు. ఆ ఫొటో చూసిన వారు తమకు ఎంగేజ్‌మెంట్ అయిందని అనుకున్నారని తెలిపారు. షూటింగ్స్‌తో తాను బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఆ ఫొటో నిజమేననుకుని టాలీవుడ్‌లోని తన స్నేహితులు కూడా కాల్ చేశారని తెలిపారు. దీంతో ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని, అది సినిమాలోని స్టిల్(A still from the movie) మాత్రమేనని చెప్పానని వివరించారు. ఈ ఫొటోను రిలీజ్ చేసిన మూవీ టీంను తిట్టుకున్నానని చెప్పారు. ఈ ఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక పేర్కొన్నారు.

 విడుదలకు సిద్ధంగా బ్రదర్ మూవీ

‘నానీస్ గ్యాంగ్‌లీడర్(Nanni’s gangleader)’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఇటీవల విడుదలైన ‘సరిపోదా శనివారం(Saripoda Sanivaaram)’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘OG’ కోసం పనిచేస్తున్నారు. కోలీవుడ్‌లో ఆమె నటించిన ‘బ్రదర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు తమిళ స్టార్ హీరో జయం రవి(JayamRavi) తెలిపారు. ఈ విషయాన్ని గత నెల రవి సోషల్ మీడియాలో అధికారంగా ప్రకటించాడు. కొన్ని రోజులుగా రవి తన భార్యతో విడాకులు(Divorce) తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే దానిపై ఆయన అధికారికంగా ప్రకటించారు. అయితే తాము ఒకరికొకరు ఇష్టం, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవి తెలిపారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *