Tollywood: నిర్మాతలు వర్సెస్ సినీ కార్మికులు.. రంగంలోకి మెగాస్టార్!

తెలుగు చిత్రపరిశ్రమ(Tollywood)లో గతకొంత కాలంగా కొనసాగుతున్న నిర్మాతలు, సినీ కార్మికుల(Producers and film workers) మధ్య వేతనాల వివాదానికి చెక్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య వేతనాల పెంపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో షూటింగ్‌(Shootings)లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమ సమస్యను చక్కదిద్దేందుకు మెగాస్టార్ చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన నివాసంలో ప్రముఖ నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ భేటీలో నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్(Allu Aravind), దిల్ రాజు(Dil Raju), సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

10 నుంచి 15 శాతం పెంపునకు సిద్ధం

ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేస్తున్న 30% వేతనాల పెంపు ఎందుకు సాధ్యపడటం లేదనే వివరాలను నిర్మాతలు చిరంజీవికి వివరించారు. ఇప్పటికే తాము 10 నుంచి 15 శాతం పెంపునకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిరంజీవి నివాసంలో నిర్మాతల సమావేశం ముగిసిన అనంతరం నిర్మాత సి.కల్యాణ్(Producer C. Kalyan) మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంపై చిరు విచారం వ్యక్తం చేశారని, షూటింగ్‌లు బంద్ కావడం బాధాకరమని చెప్పారని తెలిపారు. సినీ కార్మికుల సమస్యల(Problems of film workers)ను కూడా విని పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని ఆయన అన్నారు.

త్వరలో సినీ కార్మిక నాయకులతో చిరంజీవి భేటీ

ఈ సమస్యపై రెండు రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చిరంజీవి(Chiranjeevi) చెప్పినట్టు కళ్యాణ్ వివరించారు. త్వరలో చిరంజీవి సినీ కార్మిక నాయకులతోనూ భేటీ కానున్నారని, వారి వాదనలు కూడా విన్న తర్వాత ఒక పరిష్కారానికి వస్తారని ఆయన తెలిపారు. చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తుందని, వారితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని కళ్యాణ్ పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *