టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్ (Kingdom)’ చిత్రం తమిళనాట తీవ్ర వివాదంలో చిక్కుకుంది. శ్రీలంక తమిళుల(Sri Lankan Tamils) మనోభావాలను దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఆరోపిస్తూ అక్కడి తమిళ జాతీయవాద సంఘాలు ఆందోళనలకు దిగాయి. సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు(protests) చేపట్టాయి. గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఎన్‌టీకే కార్యకర్తల ఆందోళన
అయితే, ఈ చిత్రంలో శ్రీలంక తమిళులను ప్రతినాయకులుగా చూపించారని, తమిళులు ఆరాధ్య దైవంగా భావించే మురుగన్ పేరును విలన్‌కు పెట్టడంపై నామ్ తమిళ్ కచ్చి (NTK) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమిళుల అస్తిత్వాన్ని, చరిత్రను కించపరచడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద ఎన్‌టీకే కార్యకర్తలు(NTK activists) నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను వెంటనే నిషేధించాలని డిమాండ్(Demand to ban) చేశారు.
#Kingdom interval – movie has portrayed Jaffna tamils as evil people who oppressed Indians who migrated to Srilanka .
Why do this @TheDeverakonda ? And you come to Tamilnadu to promote this movie ?#Ban_Kingdom_Movie #Kingdom #VijayDevarakonda #Telugu#திருட்டுதிராவிடம் pic.twitter.com/vrFbBK9nQg
— tamilkural (@tamilkurippugal) August 5, 2025
పోలీసులకు, ఎన్‌టీకే సభ్యులకు మధ్య తోపులాట
ముఖ్యంగా, రామనాథపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఓ థియేటర్‌లో సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల(Agitators)ను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్‌టీకే సభ్యులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే అదనపు బలగాలను మోహరించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి గాయాలు కాలేదని తెలిసినప్పటికీ, ‘కింగ్డమ్’ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
தமிழுக்கும் தமிழர்க்கும்
ஒரே பாதுகாப்பு நாம் தமிழர் கட்சி#BoycottKingdomMovie pic.twitter.com/wsaT90RS1H— 𝐯𝐨𝐢𝐜𝐞 𝐨𝐟 𝐤𝐚𝐫𝐮𝐫 (@voiceofkarur) August 5, 2025






