దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్-2025 తుది సమరానికి(IPL Final 2025) రెడీ అయింది. తొలిసారి ట్రోఫీ గెలుచుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్(RCB) పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ బిగ్ ఫైనల్లో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచులో ఇరు జట్లు గత మ్యాచులో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లు 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం తహతహలాడుతున్నాయి. ఈరోజు ఇరు జట్లలో ఒకరి ఆ కల నెరవేరనుంది.
THE TOSS OF IPL 2025 FINAL – INCREDIBLE ATMOSPHERE AT NMS 🤯#ipl #IPL2025 #IPLFinals #IPLFinal #RCBvsPBKS #PBKSvsRCB #RCBvPBKS #PBKSvRCB #iplfinal2025 #MIvsPBKS pic.twitter.com/7PLIunv85R
— IPL 2025 (@bgt2025) June 3, 2025
మ్యాచ్ చూసేందుకు వచ్చిన డివిలియర్స్, గేల్
ఇక ఫైనల్ మ్యాచుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఫైనల్ టాస్‌కు ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తర్వాత తమ జట్టు ఫైనల్‌కు వస్తే మ్యాచ్ చూడడానికి వస్తానని డివిలియర్స్ చెప్పాడు. అన్న మాట నిలబెట్టుకున్న ఈ సౌతాఫ్రికా మాజీ విధ్వంసకర వీరుడు ఐపీఎల్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ సపోర్ట్ చేయడానికి వచ్చేశాడు. భారీగా క్రౌడ్ తరలిరావడంతో పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించారు.
తుది జట్లు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్(C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(Wk), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(Wk), శ్రేయాస్ అయ్యర్(C), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్






