IPL-2025 FINAL: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈసాలా కప్ బెంగళూరుదే

18 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రతిసారి ఈ సాలా కప్ నమదే.. అంటూ బెంగళూరు అభిమానులు సందడి చేయడం.. చివరకు నిరాశలో మునిగిపోవడం పరిపాటిగా మారిపోయేది. కానీ ఈ సారి అలా జరగలేదు. IPL 2025 సీజన్ తొలి మ్యాచు నుంచి ఆ జట్టులో ఓ పట్టుదల, పోరాట పటిమ కనిపించాయి. ఈసారి ఎలాగైనా సరే కప్ నెగ్గాలనే కసి RCB ప్లేయర్లలో కనిపించింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్(Ahmadabad) వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ ఉత్కంఠ పోరులో పంజాబ్‌(PBKS)ను చిత్తు చేసి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) తొలిసారి ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. ముఖ్యంగా ఈ చారిత్రాత్మక విజయంపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) భావోద్వేగానికి లోనయ్యారు.

కోహ్లీ బాధ్యాయుత ఇన్నింగ్స్

అహ్మదాబాద్‌లో తొలుత వరుణుడు కాస్త ఆందోళన కలిగించినా.. మ్యాచ్ జరిగే సమయానికి శాంతించాడు. దీంతో అనుకున్న సమయానికే టాస్ పడింది. ఫైనల్‌ పోరులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ అయ్యర్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190/9 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ (16) నిరాశపరిచాడు. మరో ఎండ్‌లో కోహ్లీ(43) అటాకింగ్‌కు వెళ్లకుండా అగర్వాల్ (24), పాటీదార్ (26)లకు సపోర్ట్ చేశాడు. వీరంతా ఔటయ్యాక లివింస్టోన్ (25), జితేశ్ (24), షెఫర్డ్ (17) మెరుపు మెరిపించడంతో ఆర్సీబీ 190/6కి పరిమితమైంది. ఒకానొక దశలో 200 పరుగులు దాటేలా కనిపించినా.. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ఆ జట్టులో అర్ష్‌దీప్ 3, జెమీసన్ 3 వికెట్లు కూల్చగా.. అజ్మతుల్లా, వైశాక్, చాహల్ తలో వికెట్ తీశారు.

శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించినా..

అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ (24), ప్రభ్‌సిమ్రన్ (26) తొలి వికెట్‌కు 43 పరుగులు అందించి మంచి పునాది వేశారు. కానీ ఆ వెంటవెంటనే వీరిద్దరితోపాటు కెప్టెన్ అయ్యర్ కూడా(1) పెవిలియన్ చేరడంతో పంజాబ్ తడబడింది. కానీ మరో ఎండ్‌లో జోష్ ఇంగ్లిస్(39) ధాటిగా ఆడాడు. ఆ తర్వాత నేహాల్ వధేరా (15), స్టొయినిస్ (6) నిరాశపర్చారు. చివర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61) విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది. దీంతో 20 ఓవర్లలో 184/7కే పరిమితమైంది. దీంతో విజయం, ఐపీఎల్ ట్రోఫీ రెండూ ఆర్సీబీని వరించాయి.

Image

దెబ్బకొట్టిన భువనేశ్వర్, కృనాల్ పాండ్య

బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 2, కృనాల్ పాండ్య 2, యశ్, హేజిల్ వుడ్, షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కృనాల్ పాండ్య కట్టుదిట్టంగా బౌలింగ్ వేయగా.. చివర్లో భువనేశ్వర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కృనాల్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ చిరస్మరణీయ విజయంతో బెంగళూరు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు వీధులు జనసంద్రంగా మారాయి. అభిమానులు జెండాలు ఊపుతూ, బాణసంచా కాలుస్తూ, నినాదాలతో హోరెత్తించారు.

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *