Virat Kohli: నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే.. కోహ్లీ ఎమోషనల్ స్పీచ్

జట్టు తొలి సీజన్‌తో మొదలైన అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది ప్లేయర్లు ఎన్నో జట్లు మారారు. ఎందరో IPL నుంచి దూరమయ్యారు. కానీ ఒక్కడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అదే పట్టుదల, అదే నిబద్ధతతో ఉన్నాడు. అతడే కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటి వరకూ బెంగళూరు జట్టుతోనే ఉంటూ గెలుపోటముల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఆ జట్టులోకి క్రిస్ గేల్(Chris Gayle), డివిలియర్స్(AB de Villiers), డుప్లెసిస్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లాంటి ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్లిన కోహ్లీ మాత్రం ఒకే జట్టుతో 18 ఏళ్లు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. నిన్న పంజాబ్‌పై అపూర్వ విజయంతో అతడి నిరీక్షణకు తెరపడింది. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy)ని ముద్దాడిన క్షణంలో కోహ్లీ తీవ్ర భావోద్వేగాని(Emotional)కి గురయ్యాడు.

Image

కళ్లలో కన్నీళ్లు తెచ్చుకున్న కోహ్లి..

ఐపీఎల్ 2025 టైటిల్‌ను విజయవంతంగా గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సంబరాల్లో మునిగిపోయింది. ఈ చారిత్రాత్మక విజయంపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఎమోషనల్ అయ్యాడు. కళ్లలో కన్నీళ్లు తెచ్చుకున్న కోహ్లి.. “నా హృదయం, నా ఆత్మ అన్నీ బెంగళూరుతోనే అనుబంధంగా ఉన్నాయి. నేను ఎప్పుడు ఐపీఎల్ ఆడుతున్నా, ఆర్‌సీబీ కోసమే ఆడతాను. నా నమ్మకాన్ని ఎప్పుడూ మార్చలేదు. ఇతరులు కొత్త జట్లకు మారినా, నేను మాత్రం ఆర్‌సీబీకి నా విధేయతగా ఉన్నాను. ఏ క్షణామైనా మిగిలిన జట్లకు వెళ్లే ఆలోచన వచ్చినా, నా హృదయం మాత్రం ఎప్పుడూ బెంగళూరుతోనే ఉంది. ఈ రోజు నేను బేబీలా నిద్రపోతాను. ఇది బెంగళూరు అభిమానుల గెలుపు” అని కోహ్లి పేర్కొన్నాడు.

బెంగళూరు అభిమానుల కల నిజమైంది

“ఆర్సీబీ జట్టు ఎప్పుడూ ట్రోఫీని గెలవలేదు. కాబట్టి వేరే జట్టుకు వెళ్లాలనే ఆలోచన వచ్చిందన్నది అబద్ధం కాదు. కానీ నేను ఆర్సీబీలోనే భాగంగా కొనసాగాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. నా మనస్సు, హృదయం, ఆత్మ బెంగళూరుతో ముడిపడి ఉన్నాయి. ఈ టైటిల్ కోసం అభిమానులు 18 సంవత్సరాలుగా ఎదురు చూశారు. మా జట్టు ఓడినప్పుడల్లా వాళ్లు మమ్మల్ని వెనక నుంచి తట్టి ప్రోత్సహించారు. ఎక్కడ ఆడినా వారు మాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల కల నిజమైంది” కోహ్లీ అన్నాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *